సంక్షేమ పాలన బి ఆర్ఎస్ తోనే సాధ్యం

సంక్షేమ పాలన బి ఆర్ఎస్ తోనే సాధ్యం
  • మన మండల బిడ్డ మల్లనను ఆశీర్వదించండి.
  • గడపగడపకు ప్రచారంలో
  • ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు

ముద్ర ప్రతినిధి నడిగూడెం: రాష్ట్రంలో సంక్షేమ పాలన టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని నడిగూడెం మండల పరిషత్ అధ్యక్షురాలు జ్యోతి మధుబాబు అన్నారు. సోమవారం రోజు మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారం చేశారు.కోదాడ నియోజకవర్గంలో  బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి అందాలన్న- బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలన్న, కోదాడ నియోజకవర్గంలో బొల్లం మల్లయ్య యాదవ్  గెలుపు అవసరమన్నారు .ప్రతి ఒక కుటుంబానికి పెద్దన్నగా మారిన మన మండల ముద్దుబిడ్డ మల్లయ్య యాదవ్ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా,30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుపైఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి గడపకు వెళ్లి అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి,ప్రధాన కార్యదర్శి బడేటి చంద్రయ్య,దేవబత్తిని సురేష్ ప్రసాద్,కాసాని వెంకటేశ్వర్లు, గార్లపాటి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పిటిసిమార్తి ఉపేందర్,దున్న సుధాకర్,భువనగిరి ఉపేందర్,అనంతుల మహేష్ గౌడ్, బొల్లం శీను,దాసరి శీను,జలీల్, గంగరాజు నడిగూడెం మండల గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.