కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ
  • బిఆర్ఎస్ వాళ్లు గ్లోబల్ ప్రచారాలు మానుకోండి
  • వ్యక్తిగత తగాదాను పార్టీకి అంటగడుతున్నారు
  • కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రాజా

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రాజా అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గట్టికల్ గ్రామానికి చెందిన తిరుమల్ రెడ్డి వ్యక్తిగత కారణాలతోటి దాడి చేస్తే ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం శోచనీయమన్నారు.

దామోదర్ రెడ్డి 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తిగా ఉన్నాడని అతనిపై అభండాలు, అబూత కల్పనలు చేసినంత మాత్రాన సూర్యాపేట ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. ఓడిపోతామని భయంతో బిఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి గ్లోబల్ ప్రచారానికి దిగుతున్నారని ఇలాంటి ఆరోపణలు మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని వారు హెచ్చరించారు. ఇన్ని రోజులు మంత్రి  వట్టే జానయ్య యాదవ్ కు డీసీఎంఎస్ పదవి ఇచ్చి అతనిపై వచ్చిన ఆరోపణలకు, మంత్రి కారకుడు కాదా! అని ప్రశ్నించారు. వట్టే జానయ్య యాదవ్ అక్రమ సంపాదనలో మంత్రికి వాటా లేదా అన్నారు . దామోదర్ రెడ్డి పరిపాలన కాలంలో ఎలాంటి ఘర్షణ వాతావరణకు తావివ్వకుండా పరిపాలన చేసిన ఘనత దామోదర్ రెడ్డిది అని కొనియాడారు. వేలకోట్ల రూపాయలు అభివృద్ధి చేసినానంటున్న మంత్రి, అభివృద్ధి ముసుగులో అవినీతి చేయలేదా!అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కుమ్మరి కుంట్ల వేణుగోపాల్, నేరెళ్ల మధు గౌడ్ గోపగాని గిరి , కుందమల్ల శేఖర్, పోలగాని బాలు గౌడ్, కమ్రుద్దీన్, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు డిఆర్, ఐఎన్టీయూసీ నాయకుడు రెబల్ శ్రీను, జితేందర్ ,సాయి నేత, తదితరులు పాల్గొన్నారు.