వంటావార్పు తో జెపిఎస్ ల నిరసన

వంటావార్పు తో జెపిఎస్ ల నిరసన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత పదకొండు రోజులుగా జూనియర్ పంచాయితీ సెక్రటరీలు చేస్తున్న సమ్మె సోమవారం కూడా కొనసాగింది. ప్రొబేషనరీ కాలం ముగిసినందున తమ సర్వీసులు క్రమబద్ధం చేయాలని కోరుతూ వారు సమ్మె చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ చేసిన ప్రభుత్వం తమ సర్వీసుల క్రమబద్ధీకరణ జి ఓ విడుదలకు  చర్యలు తీసుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.