వైభవంగా ప్రతిష్ఠాపన మహోత్సవాలు

వైభవంగా ప్రతిష్ఠాపన మహోత్సవాలు

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామలోని  వైశ్య భవన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించుకున్న వాసవీ కన్యకాపరమేశ్వరి, నగరేశ్వర, శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా సాగుతోంది. రెండో రోజైన శుక్రవారం వాస్తు హోమం, శాంతి హోమం నిర్వహించారు. ప్రముఖ సిద్ధాంతి కృష్ణమాచారి,  వేద పురోహితులు అప్పయ్య శాస్త్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ట్రస్ట్ అధ్యక్షులడు  పజ్జూరి గోపయ్య, కార్యదర్శి బుద్ధ రమేష్, కోశాధికారి రామిని రాజేశ్వర్, జైన్ రమేష్ తో పాటు జనగామలోని పుర ప్రముఖులు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.