మూలుగ బొక్క పడలేదని పెళ్లి రద్దు..

మూలుగ బొక్క పడలేదని పెళ్లి రద్దు..
  • మెట్‌పల్లి లో బలగం సినిమా ఘటన

మెట్‌పల్లి ముద్ర :- పెళ్ళికొడుకు బంధువులకు మూలుగ బొక్క వేయలేదని వివాహం రద్దు చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. మెట్‌పల్లి మండలానికి చెందిన యువకుడి కి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతి తో పెళ్లి జరిపించడానికి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.దీంతో కట్న కానుకలు అన్ని మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం సందర్భంగా నవంబర్ లో యువతి ఇంట్లో మాంసహారంతో భోజనం ఏర్పాటు చేశారు.అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడగడంతో,మూలుగ బొక్కలు లేవు అనడంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది.

గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వైపు   బంధువుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఆ కేసు శనివారం ముగిసిపోవడం తో చివరలో పెళ్లి రద్దు చేసుకోవడంతో బలగం సినిమా గుర్తుకు వచ్చింది. అత్త గారింట్లో అల్లుడికి మూలుగ బొక్క వేయకపోవడంతో బావ బామ్మర్థులకు మధ్య గొడవ జరిగింది.మామ చనిపోయేవరకు అల్లుడు తన అత్తగారింటికి రాలేదు. అయినా వీళ్ళ చాదస్తం కాకపోతే మూలుగ బొక్క కోసం పెళ్లిరద్దు చేసుకోవడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.