రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం ఖాయం

రాష్ట్రంలో మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అధికారంలోకి రావడం ఖాయం
  • తుంగతుర్తి నియోజకవర్గంలో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన ఎమ్మెల్యే
  • అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి తలమానికం

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి మండలం తూర్పు గూడెం, గానుగుబండ, కరివిరాల,కొత్తగూడెం గ్రామాలలో టిఆర్ఎస్ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో మరోమారు బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు .అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. నేడు కాలేశ్వరం జల్లాలతో తుంగతుర్తి నియోజకవర్గం కలకలలాడుతుందని అన్నారు. నాటి బీడు భూములు నేడు పచ్చటి పంట పొలాలు కనిపిస్తున్నాయని ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు . నియోజకవర్గంలో నాడు హింసాయుత వాతావరణం ఉండగా నేడు ప్రశాంత వాతావరణంలో రైతులు రైతు కూలీలు ప్రజలు వ్యవసాయ పనులు నిమగ్నమయ్యారని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణ నెలకొని ఉందని అన్నారు .గత పది సంవత్సరాలుగా అభివృద్ధి తప్ప హత్య రాజకీయాలకు  తావు లేదని ఇది  బిఆర్ఎస్ పార్టీ సాధించిన ఘనత అని అన్నారు. అభివృద్ధి నిధులతో గత 50 సంవత్సరాలుగా అపరిస్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సాగు, తాగు నీరు లేక విద్యుత్ సౌకర్యం లేక అల్లాడుతున్న రైతాంగానికి కాలేశ్వరం జలలు ఒక వరమని అలాగే తాగునీటితో అల్లాడుతున్న ప్రజలకు మిషన్ భగీరథ ఎంతో ఉపశమనం కలిగించిందని అన్నారు.

వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు గణనీయంగా పెంచి వారిని ఆదుకున్న ముఖ్యమంత్రి మరో మారు ముఖ్యమంత్రిగా కావడానికి  ప్రజలు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు .నియోజకవర్గంలో 49 వేలపెన్షన్లు 90 వేలకు పైగా రైతుబంధు,11వేల కళ్యాణ లక్ష్మి, రైతు బీమా లాంటి పథకాలుఅమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని అన్నారు. ప్రజలు ఈసారి ఎన్నికల్లో విపక్షాలకు గట్టి బుద్ధి చెప్పి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడానికి ప్రజా ఆశీర్వాదం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు ,రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు ,మాజీ ఏఎంసీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, ఎంపీపీ కవిత ,సర్పంచ్నల్లు రామచంద్రారెడ్డి తూర్పు గూడ సర్పంచ్ గుజ్జ పూలమ్మ లతోపాటు పలువురు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే రోడ్ షో నిర్వహించారు.