హోళీ వేడుకల్లో కలెక్టర్, ఎస్పీ

హోళీ వేడుకల్లో కలెక్టర్, ఎస్పీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో హోళీ వేడుకలు అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాల మధ్య మంగళవారం జరుపుకొన్నారు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి కామ దహనాన్ని నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి చిన్నారులు రంగులు చేత పట్టుకొని ఆడడం ప్రారంభించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి , ఎస్పీ ప్రవీణ్ కుమార్, తదితర ఉన్నతాధికారులు, ఉద్యోగులు క్యాంప్ కార్యాలయంలో రంగులు చల్లుతూ సంబరాలు చేశారు.