పార్టీలు వేరైనా ప్రాంతం ఒకటిగా ముందుకు పోవాలి - దొడ్డ నారాయణరావు

పార్టీలు వేరైనా ప్రాంతం ఒకటిగా ముందుకు పోవాలి - దొడ్డ నారాయణరావు

చిలుకూరు ముద్ర : స్వతంత్ర సమరయోధులు, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ దొడ్డ నారాయణ రావు కి , చిలుకూరు గ్రామపంచాయతీ  పాలకవర్గం, బుధవారం ఆయనను ఘనంగా సన్మానించుకున్నారు, ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఆయన చేసిన పోరాటాలు, చిన్నతనం నుండి కమ్యూనిస్టు పార్టీలకి ఆకర్షితులై, నిజాం నవాబు  ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలలో ఆయన అన్నయ్య అయినటువంటి కామ్రేడ్ దొడ్డ నరసయ్య, అడుగుజాడల్లో నడుస్తూ, రజాకార్ల వ్యతిరేకంగా పోరాటాలు నడిపినటువంటి చరిత్ర  ఆయనకు ఉందని, ఆయన చిలుకూరు గ్రామానికి 23 సంవత్సరాలు సర్పంచిగా పనిచేసి, 10 సంవత్సరాలు ఎంపీపీగా పనిచేసి, ఐదు సంవత్సరాలు సింగిల్ విండోస్ చైర్మన్ గా కూడా ఆయన పని చేశారని, ఆయన సారా మద్యపానం నిషేధించాలని ఎన్నో ఉద్యమాలు చేశారు, చిలుకూరు గ్రామం అభివృద్ధిలో ఆయన పాత్ర ఎనలేనిదని చిలుకూరులో మొట్టమొదటి అష్టాంధ  మహాసభ జరిగిందని, ఆ మహాసభకు చిలుకూరు నుండి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణం అని, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినందుకు, మూడు సంవత్సరాలు జైలు జీవితం కూడా అనుభవించారని, ఇలాంటి మహానుభావులకు సన్మానించుకోవడం ఎంతో గర్వకారణం అని, ఇలాంటి మహానుభావులు చిలుకూరులో పుట్టడం చిలుకూరు గ్రామ ప్రజలకు గొప్ప వరమని, ఇప్పుడు ఉన్న యువత తప్పకుండా ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తితో ముందుకు పోవాలని వారు అన్నారు,

 అనంతరం సన్మాన గ్రహీత దొడ్డ నారాయణరావు మాట్లాడుతూ  తెలంగాణ సాయుధ  పోరాటంలో 4000 మంది అమరులైనారని, నైజాం నవాబు పాలనలో, రజాకార్లకు  ఆయుధ పోరాట యోధులకు, మధ్య జరిగిన, కాల్పులలో ఎంతోమంది  ప్రాణాలు కోల్పోయారని, అయినప్పటికీ వెనుదురుగకుండా రజాకార్లకు వ్యతిరేకంగా ముందుకు పోతూ, బీద బిక్కీ  బడుగు బలహీన వర్గాలకు, అండగా ఉంటూ పోరాటాలు సాగించామని, కుటుంబాలకు దూరమై అండర్ గ్రౌండ్ లో ఉంటూ పోరాటాలు కొనసాగించమని, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడితే  కాల్చి చంపేవారు లేదంటే జైలలో పెట్టి చిత్రహింసలు  పెట్టే వారిని, జైలు జీవితాలు కూడా ఒక్కొక్కరు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అలా ఉండి జైలలో గడిపి వచ్చామని, చిలుకూరు అంటే పోరాటాలకు స్ఫూర్తినిచ్చే ఒక గడ్డగా  నిలబడిందని, ఈ గ్రామ ప్రజలు ఎంతో చైతన్యవంతమైన వారని, పార్టీలు వేరైనా ప్రాంతం కోసం నిలబడి ప్రాంత అభివృద్ధి కోసం ముందుంటారని , ఈరోజు నాకు  సన్మానించడం ఎంతో సంతోషంగా  ఉందని , ఇదేవిధంగా గ్రామ అభివృద్ధిలో అందరూ కలిసి  కట్టుగా, పనిచేసి గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతారని, ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో, సర్పంచ్ కొడారు  వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ ముక్క లక్ష్మీనారాయణ, పంచాయతీ సెక్రెటరీ మహమ్మద్ షరీఫ్ ఉద్దీన్, వార్డు మెంబర్లు, సత్యనారాయణ, రాములు, బేగం, అనురాధ, పిల్లుట్ల పుష్ప, అనిత, గుండు వీరబాబు, చిలుకూరు, ఒకటవ ఎంపిటిసి, బెల్లంకొండ నాగయ్య  రమణ, కస్తూరి నరసయ్య, పిల్లుట్ల కనకయ్య, కాసాని అంజయ్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,