దుర్గామాత ఆలయ, విగ్రహ ప్రతిష్టోత్సవం

దుర్గామాత ఆలయ, విగ్రహ ప్రతిష్టోత్సవం

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండలో ఈనెల 30 నుండి మే 5వ తేదీ వరకు దుర్గామాత ఆలయ, విగ్రహ ప్రతిష్టోత్సవ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి, సర్పంచ్ చల్ల ఉమా సుధీర్ రెడ్డి తెలిపారు.30వ తేదీన గణపతి పూజ, మే 1న యాగశాల ప్రవేశం, 2వ తేదీన ధ్వజ కుంభ ఆరాధన, మూల మంత్ర ప్రాణ ప్రతిష్ట, 3న మహా పూర్ణాహుతి, 4న అమ్మవారికి మొక్కుబడులు, బోనాల సమర్ప, 5న బలి అర్పణతో ప్రతిష్టోత్సవం ముగుస్తుంది. ఈ కార్యక్రమాలను స్థానాచార్యులు సౌమిత్రి లక్ష్మణాచార్యుల, గ్రామ అర్చకులు జీడి కంటి వారణాచార్యుల పర్యవేక్షణలో దుర్గామాత ఆలయ, విగ్రహ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు.