రైలు కింద పడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

రైలు కింద పడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలో రైలు కిందపడి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నడు. రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు రాజేందర్ (37) భీంపెళ్లి రైల్వే గేట్ వద్ద గేట్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేందర్ కు భార్య రమాదేవి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు హేడ్ కానిస్టేబుల్ తిరుపతి పేర్కొన్నారు.