పూసల కులాన్ని ఎంబీసీ లో చేర్చాలి

పూసల కులాన్ని ఎంబీసీ లో చేర్చాలి

పూసల సంచార జాతులకు సర్కారు రుణాలు

మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :తెలంగాణ రాష్ట్రంలో అనగారిన వర్గాలను ఆర్థికంగా ఆదుకుని, మరుగున పడిన వృత్తి కులాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ  గంగుల కమలాకర్ అన్నారు. అందుకే పూసల, సంచార జాతుల కులాలకు లక్ష రూపాయలు రుణాలను ప్రభుత్వం అందజేయబోతుందని చెప్పారు. 
ఆదివారం కరీంనగర్ లోని వాసర గార్డెన్స్ లో జరిగిన పూసల సమర శంకరావం రాష్ట్ర సదస్సుకు మంత్రి  ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తరతరాలుగా అన్నగారిన కులాలు సంచార జాతులు వృత్తి కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సోదాహరణంగా వివరించారు. గత పది దశాబ్దాలుగా గుర్తింపుకు నోచుకోని కులాలు, వాటి వృత్తులు కనుమరుగవుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ వృత్తులను బ్రతికించే కార్యక్రమాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ప్రతి కులాన్ని సీఎం కేసీఆర్ పెద్దపేట వేస్తున్నారని చెప్పారు. అందుకే జిల్లాలతో పాటు రాష్ట్ర రాజధానిలో అన్ని బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. 
గతంలో పూసల సామాజిక వర్గం ఎలాంటి గుర్తింపుకు నోచుకోలేదని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్థిక భరోసా ఇచ్చేందుకు రకరకాల పథకాలను రూపకల్పన చేసిందని మంత్రి వివరించారు. ఇందులో భాగంగా పూసల తల్లులకు ఒక లక్ష రూపాయల రుణాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని త్వరలోనే మరో క్యాబినెట్ సబ్ కమిటీలు విధివిధానాలు రూపొందిస్తామని వెల్లడించారు. 
వృత్తులను ఆధునీకరించడంలో భాగంగా పూసల లాంటి కులాలకు ఒక ద్విచక్ర వాహనాన్ని, వృత్తుల పనిముట్లను అందజేయబోతున్నట్టు చెప్పారు. పూసల కులాన్ని ఎంబిసిలో చేర్చే అంశం ప్రభుత్వ ప్రతిపాదనలో ఉందని, అలాగే ఆర్థికంగా నిలదీక కొనేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వమే చూసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ సంచార జాతులు ఎంబీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తుందని అనగారిన వర్గాల విద్యార్థులు ఆ విద్యాలయాలను ఉపయోగించుకోవాలని కోరారు. పూసల కులంను డిఎన్టిలో చేర్చే అంశం కేంద్రం పరిధిలో ఉందని అయితే అనగారిన వర్గాలకు కేంద్రం సహాయ నిరాకరణ చేస్తుందని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రతో బీసీ ఎంబీసీ కులాలకు న్యాయం జరిగే విధంగా సకల చర్యలు తీసుకుంటుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. కరీంనగర్ పూసల సంఘం అధ్యక్షుడు కోనేటి శ్రీనివాస్ నాగమణి అధ్యక్షత వహించిన ఈ
కార్యక్రమంలో శాసనమండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి, నగర మేయర్ సునీల్ రావు, రవీందర్రావు ల తో పాటు పూసల ఆత్మ గౌరవ ట్రస్ట్ చైర్మన్ గుంటుపల్లి వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పగిడిపల్లి బాలయ్య పసుపులేటి వేదాంతం తన్నీరు వెంకటేశం గుండ్లపల్లి సత్యనారాయణ శని వెంకటేశం పనీర్ సత్యం నూతన గంటి పురుషోత్తం, మధురకొల వెంకటయ్య,  గుడ్ల సమ్మయ్య, గుడ్ల తిరుపతి, పొదిల గంగారం సుదర్శన్, పోదిల వెంకట రమణ, పట్టెం  కొమురయ్య, పొదిలి రమేష్, కోనేటి రమేష్, కోనేటి నాగమణి తన్నీరు కళా పూర్ణ లు పాల్గొన్నారు.