పారదర్శకంగా మొదటి దశ ఈ.వి.ఎం యంత్రాల ర్యాండమైజేషన్ పూర్తి - జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు

పారదర్శకంగా మొదటి దశ ఈ.వి.ఎం యంత్రాల ర్యాండమైజేషన్ పూర్తి - జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు
  • ఆన్ లైన్ ద్వారా మొదటి దశ ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్
  • ర్యాండమైజేషన్ పట్ల  సంతృప్తిని వ్యక్తపరిచిన రాజకీయ పార్టీల ప్రతినిధులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: పారదర్శకంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి దశ ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ పూర్తి చేశామని జిల్లా  కలెక్టర్ , ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు అన్నారు.శుక్రవారం పాత కలెక్టరేట్ లోని  సమావేశ మందిరంలో  జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు   ఈవిఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు.

జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని అన్నారు. 

మన జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 1201 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 4684  యూనిట్లు కేటాయించడం జరిగిందని దానిలో బ్యాలెట్ల యూనిట్లు 1502, కంట్రోల్ యూనిట్లు 1502, వివిఫ్యాట్స్ 1680 ర్యాoడమజేషన్ ద్వారా నియోజక వర్గాలకు కేటాయించడం జరిగిందని తెలిపారు.  హుజూర్నగర్ 1201, కోదాడ 1154 ,సూర్యాపేట 10 57, తుంగతుర్తి 12 72, ర్యాండమజైషన్ ద్వారా కేటాయించడం జరిగిందని తెలిపారు

ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకత తీసుకోని వచ్చేందుకు ర్యాండమైజేషన్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ ప్రారంభించిందని, ఏ ఈవిఎం యంత్రం ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో వెళ్తుందో  ఆన్ లైన్ ఎన్నికల కమిషన్ రూపొందించిన సాఫ్ట్ వేర్ మాత్రమే నిర్దేశిస్తుందని అన్నారు.

మొదటి ర్యాండమైజేషన్ సంబంధించి హర్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించామని, నియోజకవర్గ కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్ రూం తరలించే సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేస్తామని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ చెందిన ప్రజాప్రతినిధి సిహెచ్ రాజేశ్వరరావు,టిఆర్ యస్ దేవరశెట్టి సత్యనారాయణ సిపిఎం పార్టీ నుండి కోట గోపి బీఎస్పీ పార్టీ నుండి స్టాలిన్ మాట్లాడుతూ కొత్త ఈవీఎంలు తెచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ప్రతి విషయాన్ని తమ సమక్షంలోనే జరిపి చూపించారని, ఈవీఎంస్ ర్యాండమజైషన్ పట్ల కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక ,ఏ వెంకటరెడ్డి, అర్.డి. ఓ.లు, వీర బ్రహ్మచారి జగదీష్ రెడ్డి సిహెచ్ సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుండి సిహెచ్ రాజేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ నుండి దేవరశెట్టి సత్యనారాయణ, సిపిఎం నుండి కోట గోపి, బీఎస్పీ నుండి స్టాలిన్, వైఎస్సార్ సీపీ నుండి డి రమేష్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.