చీరలు పట్టివేత

చీరలు పట్టివేత

ముద్ర.వీపనగండ్ల: ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటానికి ఓ పార్టీ కి చెందిన వ్యక్తులు నిలువ చేసి ఉంచిన చీరలను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన ఘటన చిన్నంబాయి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణఓబులారెడ్డి కథన ప్రకారం మండల పరిధిలోని కొప్పునూరు గ్రామంలో మునిస్వామి ఇంట్లో ఓటర్లకు పంచడానికి నిలువ చేసి ఉంచిన 189 చీరలను స్వాధీనం చేసుకోగా ఇదే మండలంలోని అమ్మాయిపల్లె లో పబ్బా నరసింహ గౌడ్ ఇంట్లో 96 చీరలు స్వాధీనం చేసుకొని ఇరువురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు కృష్ణ, పురేందర్ గౌడ్, మహేందర్, హోంగార్డు మహేష్ ఉన్నారు.