రామాజీపేట లో బి.ఆ ర్.ఎస్ కు షాక్ - బేతి మల్లా రెడ్డి కాంగ్రెస్ లో చేరిక 

రామాజీపేట లో బి.ఆ ర్.ఎస్ కు షాక్ - బేతి మల్లా రెడ్డి కాంగ్రెస్ లో చేరిక 

ముద్ర, రాయికల్ : రాయికల్ మండలం రామాజీ పేట గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు అయిండ్లేని గంగారెడ్డి,బి.ఆ ర్.ఎస్ సీనియర్ నాయకులు ఎనుగంటి రవి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బేతి మల్లారెడ్డి, మహిళలు, కార్యకర్తలు నాయకులు  శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి, పార్టీ లోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం తో కాంగ్రెస్ పార్టీలో చేరడం పై హర్షం వ్యక్తం చేశారు.నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ దిశా నిర్దేశం చేశారు.