కాలనీలో మురుగు, చెత్త సమస్యలు పరిష్కరించండి

కాలనీలో మురుగు, చెత్త సమస్యలు పరిష్కరించండి

సిరిసిల్ల టౌన్, ముద్ర: సిరిసిల్ల పట్టణం సాయి నగర్, ఆదర్శనగర్ కు చెందిన కాలనీవాసులంత కలిసి మొన్నటి వర్షాలకు కార్గిల్ లేక్ వరదనీరు వల్ల తమ ఇండ్ల చుట్టూ చేరుతున్న నీటితోపాటు మరుగు చెత్త కూడా ఇక్కడికి వస్తుందని, ఖాళీ ప్లాట్లలో నీరు నిలిచి ఉండడం వల్ల పాములు, దోమలు మొదలగు  కీటకాల వల్ల కాలనీ వాసులంతా అనారోగ్యాలకు గురవుతున్నారని, అంతేకాకుండా కాలనీలో సిసి రోడ్ల నిర్మాణాలు త్వరగా చేపట్టాలని, మురుగు కాలువ నిర్మాణాలు త్వరగా చేపట్టాలని వీధి దీపాలు సరిగా లేవని, కుక్కల బెడద  పెరిగిపోయింది అన్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి సమయాల్లో ట్రాక్టర్లలో అక్రమ ఇసుక రవాణా జరగడం వల్ల ఇక్కడి ప్రజలు తమ నిద్ర కోల్పోతున్నామని ఇలా ఇంకెన్నాళ్లు భరించాలని వివరిస్తూ మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప అభివృద్ధి సమితి అధ్యక్షులు సాంబారి రాజు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అల్లి మహేష్ కుమార్ కోశాధికారి, తరిగొప్పుల సిద్దు, కార్యదర్శి బురం రాజగోపాల్, పెద్ది శ్రీనివాస్, మూడవ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.