ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొన్న సుధాగాని...

ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో పాల్గొన్న సుధాగాని...

మోటకొండూర్ (ముద్ర న్యూస్): మహాజన్ సంపర్క్ అభియాన్ పిలుపు పేరుతో బిజెపి రాష్ట్ర కమిటీ ఇచ్చిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు జోరుగా ఎల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర నాయకులు సుదగాని హరి శంకర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను వివరించారు. దేశంలో పేదరికం నిర్మూలన కోసం. అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు ప్రజల ఆదరణ పొందాయని అన్నారు. రానున్న ఎన్నికలలో కేంద్రంలో. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాలు ఏర్పాటు కావడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు.

బిజెపి అభ్యర్థుల అఖండ మెజార్టీతో గెలిచేందుకు ప్రతి బిజెపి కార్యకర్త సైనికునీ వలే పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పిసరి తిరుమలరెడ్డి. నాయకులు పన్నాల చంద్రశేఖర్ రెడ్డి. చిర్ర రవీందర్. అనంతుల పాండురంగారెడ్డి. ఎగ్గిడి వెంకటయ్య. గాజుల బాలరాజ్ గౌడ్. యేల్లంల శ్రీధర్ రెడ్డి. అనంతుల తిరుమలరెడ్డి. సీసా మల్లేష్ గౌడ్. గడ్డం రమేష్. సుల్తాన్ మహేందర్ యాదవ్. మల్ల అశోక్. శ్రీనివాస్ చారి. పల్లె నరేష్ గౌడ్. కట్కమోజు మహేష్ చారి. సీసా సత్యనారాయణ గౌడ్. దాసం నాగరాజు తో పాటు బిజెపి నాయకులు. కార్యకర్తలు. ప్రజలు. తదితరులు పాల్గొన్నారు.....