నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే బిడ్డ  ఖబర్దార్..కూచకుళ్ల సుహాసన్ రెడ్డి

నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే బిడ్డ  ఖబర్దార్..కూచకుళ్ల సుహాసన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి ,నాగర్ కర్నూల్ జిల్లా: టీపీసీసీ రేవంత్ రెడ్డి పై విద్యుత్ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే బిడ్డ  ఖబర్దార్ నీ మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పేంతవరకు విడిచి పెట్టేది లేదు- కూచకుళ్ల సుహాసన్ రెడ్డి   ఉచిత కరెంట్ విషయంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాటలని వక్రీకరిస్తుంది. అమెరికాలో ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ తెలంగాణలో 90శాతం రైతులు సన్న,చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారని 24 గంటల పేరుతో రైతులను మభ్య పెట్టే కంటే కోతలు లేకుండా రైతులకు ఎనిమిది గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తే బాగుంటుందని మాత్రమే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు తప్ప ఎక్కడ ఉచిత విద్యుత్ ఇవ్వము, ఉచిత విద్యుత్ రద్దు చేస్తామని ఎక్కడ రేవంత్ రెడ్డి  చెప్పలేదని స్పష్టం చేశారు.

రుణమాఫీ, ఉచిత ఎరువులు అని నమ్మించి మోసం చేసి, తరుగు పేరుమీద రైతులను దోచుకు తింటున్న బిఆర్ఎస్ లీడర్లు.. ఇచ్చిన మాట మీద నిలబడి ఒక్క సంతకంతో రుణమాఫీలు చేసి ఉచిత కరెంటు అందించిన కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పథకమే..  ఉచిత విద్యుత్ కు పేటెంట్ హక్కు కాంగ్రెస్ కే ఉందన్నారు, కొందరు బి ఆర్ ఎస్ నాయకులు అతి తెలివి ఉపయోగించి అన్ననీ మాటలను లేనిపోని పుకార్లను సృష్టిస్తూ పార్టీల మధ్య రెచ్చగొట్టే విధంగా అసభ్యంగా మర్యాద లేకుండా మాట్లాడుతున్న బిఆర్ఎస్ నాయకులు మరియు ప్రజా ప్రతినిధివైన మీరు ఈ మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది ,మర్యాదపూర్వకంగా వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే మండలంలో నీవు ఎక్కడ తిరిగిన నిన్ను అడ్డుకొని తిరుతామని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం అని అన్నారు సువాసన రెడ్డి.