ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దు. మున్సిపల్ చైర్ పర్సన్ సుజాత సత్యనారాయణ.

ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దు. మున్సిపల్ చైర్ పర్సన్ సుజాత సత్యనారాయణ.

మెట్‌పల్లి ముద్ర: పట్టణ ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ కోరారు.గురువారం వర్షాలు కురిసి నీటితో నిండిన లోతట్టు ప్రాంతాలు  అధికారులతో కలిసి పరిశీలించారు. రబ్బానీ పుర, సుల్తాన్ పుర, విస్డం స్కూల్, వెంకట్రావుపేట, టీచర్స్ కాలనీ ఏరియాలలో వరద నీటిని తాత్కాలిక కాలువలు ఏర్పాటు చేసి తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. 48 గంటలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇంటి నుండి బయటకు ఎవరు రాకూడదని.

శిథిల వ్యవస్థలో, లోతట్టు ప్రాంతాల లో ఉన్న ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర సేవల కోసం మున్సిపల్ కమిషనర్  9866577636, సానిటరీ ఇన్స్పెక్టర్ 7995014919, మున్సిపల్ జవాన్లు 99496 63372, 99087 07393, 95530 62376 నంబర్ లకు ఫోన్ ద్వారా సంప్రదించి సహాయ సహకారాలు పొందాలని సూచించారు. కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎస్ ఐ శ్యామ్ రాజ్, కౌన్సిలర్ అంగడి పురుషోత్తం, మహమ్మద్ షాకీర్ సిద్దికి, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్ లు ఉన్నారు.