పెండింగ్లో ఉన్న 3 వేల కోట్ల  స్కాలర్షిప్ రేయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

పెండింగ్లో ఉన్న 3 వేల కోట్ల  స్కాలర్షిప్ రేయంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
  • ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 1500 మంది విద్యార్థులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి

ముద్ర, షాద్‌నగర్ :-ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్థూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య రంగారెడ్డి జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం.పవన్ చౌహాన్ అధ్వర్యంలో 1500 మంది జూనియర్ కళాశాలల విద్యార్థులతో జరిగిన ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయం ముట్టడించారు. ఈ కార్యక్రమములో  ముఖ్య అతిథిగా ఎ ఐ ఎస్ ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి.శివకుమార్ పాల్గోన్నారు.  

ఈ సందర్భంగా ధర్నాను కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డక  విద్యావ్యవస్థ పూర్తిగా బ్రష్టు పట్టిందని అన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో సొంత బిల్డింగులు లేక ఎంతో మంది విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. అంతేగాక ఈ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, స్టేషనరీ  వస్తువుల అమ్మకాలు చేస్తూ విద్యార్థులను తల్లిదండ్రులను నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ ,ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలల్లో,కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని,   సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో మెనూ ప్రకారం భోజనం ఉండాలని వారు అన్నారు.

అదేవిధంగా మెస్ బకాయిలను వెంటనే విడుదల చేసి మెస్ చార్జీలు బిల్లులను పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఏ విధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంగా ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని వారు తెలిపారు. కొత్తగా తీసుకువచ్చిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును వెనక్కి తీసుకోవాలని అదేవిధంగా యూనివర్సిటీ పేరుతో మోసపోయిన విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకాష్ నాయక్ షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షుడు విజయ చారి ఏఐఎస్ఎఫ్ నాయకులు నరేష్ నితిన్ ప్రకాష్ విద్యార్థులు పాల్గొన్నారు.