కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం దించడం ఖాయం

కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం దించడం ఖాయం
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలను వెంటనే అమలు చేయాలి.
  • సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

మునగాల ముద్ర:-రానున్న ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ ఓటమి తప్పదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు శుక్రవారం మునగాల మండల కేంద్రంలో జరిగిన సిపిఎం పార్టీ మునగాల, నడిగూడెం, మోతే మండలాల పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం దేశంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య అనైక్యత సృష్టిస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందని ఆ ప్రయత్నాలు ప్రజలంతా తిప్పి కొట్టాలని ఆయన కోరారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఈ 9 సంవత్సరాల కాలంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ప్రజల సంపద ఆదాని ,అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతుందని అదేవిధంగా  రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు చెయ్యకుండా రైతులను మోసం చేస్తుందని గృహ లక్ష్మీ పథకం కింద నియోజకవర్గానికి 3,000 ఇండ్లు ఇస్తామని ప్రకటించిన అవి ఏ మూలకు సరిపోవు అన్నారు. పేదల ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన బీసీ రుణాలను అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చంద్రయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు మెదరమెట్ల వెంకటేశ్వరరావు మట్టిపల్లి సైదులు దేవర వెంకటరెడ్డి సత్యనారాయణ గోపాల్ రెడ్డి బచ్చలకూర స్వరాజ్యం సైదా విజయలక్ష్మి స్టాలిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.