ఆకలితో ఉన్న వారిని ఆదుకోవడమే అసలైన మానవత్వం

ఆకలితో ఉన్న వారిని ఆదుకోవడమే అసలైన మానవత్వం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఆకలితో అలమటించే వారిని ఆదుకోవడమే అసలైన మానవత్వం అని,ఆకలితో ఉన్న వారి కడుపు నింపినప్పుడే మానసిక ఆనందాన్ని కలిగిస్తోందని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 44 వార్డు విద్యానగర్ కు చెందిన వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు. మంగళవారం భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించి దేవుని కృపకు పాత్రులయ్యారు.  అనంతరం పిల్లలు పెద్దలు ఆట పాటలతో చూపరులను అలరించారు తదుపరి సుమారు వెయ్యి మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ప్రతీ ఒక్కరు భక్తిమార్గాన్ని అలవర్చుకోవాలని, అన్ని దానాల కన్న అన్నదానం ఎంతో గొప్పదని వారు తెలిపారు. సూర్యాపేట ప్రజలు విఘ్నేశ్వరుని చల్లనిచూపుతో సుఖసంతోషాలతో ఉండాలని వేడుకుంటూ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు నరేందర్ దాండ్గే, పారేపెల్లి శ్రీనివాస్, వెంకన్న, మోత్కూరి జయమాన్, కార్తీక, పూజిత, తనూష్, డాక్టర్ ఆనంద్ శిరీష,తో పాటు ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున మహిళలు, పురుషులు పాల్గొన్నారు.