కాంగ్రెస్ రెండో జాబితా కోసం ఇటు తుంగతుర్తి ,అటు సూర్యాపేట కాంగ్రెస్ శ్రేణుల ఎదురుచూపు

కాంగ్రెస్ రెండో జాబితా కోసం ఇటు తుంగతుర్తి ,అటు సూర్యాపేట కాంగ్రెస్ శ్రేణుల ఎదురుచూపు
  • సూర్యాపేట టికెట్ పైనే తుంగతుర్తి గెలుపోటములు ఆధారపడి ఉంటాయా?
  • సీనియర్ నాయకుడు దామోదర్ రెడ్డికి టికెట్ వస్తేనే తుంగతుర్తి లో కాంగ్రెస్ గెలుపు బాటలో పయనిస్తుందా?
  • సూర్యాపేట తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే దానిపై అధికార పార్టీ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠత.
  • సూర్యాపేట టికెట్ దామోదర్ రెడ్డికి రానిపక్షంలో దాని ప్రభావం తుంగతుర్తిపై పడనుందా?
  • తుంగతుర్తి పీఠం అద్దంకి ,పిడమర్తిలలో ఎవరికి దక్కేను?

తుంగతుర్తి ముద్ర: కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాపై అటు రాష్ట్ర కాంగ్రెస్తో పాటు ఇటు తుంగతుర్తి  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతోంది .అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఎంత ఉత్కంఠత ఉందో అటు అధికార బి ఆర్ ఎస్ పార్టీలో అంతకన్నా ఎక్కువ ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా గత రెండుసార్లు స్వల్ప మెజారిటీతో గెలుపొందిన అధికార పార్టీ అభ్యర్థి ఈసారి కూడా కాంగ్రెస్ క్యాడర్ అత్యంత ప్రతిష్టంగా ఉండడంతో అభ్యర్థి బలమైన వ్యక్తి వచ్చినట్లయితే మెజార్టీ విషయంలో సందేహాస్పదంగానే ఉంటుందని మాట వినవస్తుంది .కాంగ్రెస్ అభ్యర్థి తేలితే అధికార పార్టీ నుండి అలాగే భారతీయ జనతా పార్టీ నుండి కూడా కొంతమంది కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనేది కాంగ్రెస్ శ్రేణుల మాట  .ఇప్పటికే లోపాయ కారిగా  కొంతమంది అసంతృప్తి అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరిగినట్లు విశ్వసినీ వర్గాల సమాచారం. మండలాల్లో గ్రామాల్లో నెలకొన్న వర్గ విభేదాలు ఇందుకు కారణంగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటించగానే వలసలు మొదలవుతాయని కాంగ్రెస్ జిల్లా స్థాయి నాయకుడు బాహటంగానే చెబుతున్నారు .తమ అభ్యర్థి ఎవరైనా గెలుపు కాంగ్రెస్దేనని సూర్యాపేట జిల్లా ప్రధాన నేతలు తుంగతుర్తి ప్రాంతం వారు చెప్తున్నారు. ఇటీవల తుంగతుర్తి మండలం లో ఒకటి రెండు గ్రామాల్లో  బిఆర్ఎస్ పార్టీలోని అంతర్గత పోరు బహిరంగమైంది.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వారిలో అద్దంకి దయాకర్ ,పిడమర్తి రవి ,వడ్డేపల్లి రవి, అన్నపర్తి జ్ఞాన సుందర్, నగరి గారి ప్రీతము,లు ఢిల్లీకి, హైదరాబాద్కు తిరుగుతూ అటు పెద్దలను ,ఇటు పెద్దలను కలుస్తూతమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధిక శాతం అద్దంకి దయాకర్ ,పిడమర్తి రవి ల పేర్లు వినవస్తున్నాయి. అద్దంకి దయాకర్ రెండుసార్లు స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం రెండోసారి ఓటమికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కారణమని మాట చెబుతూ ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం మీద అద్దంకి దయాకర్ ఒత్తిడి తేస్తున్నట్లు సమాచారం. తుంగతుర్తి నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఓట్లు సుమారు 60000 ఉన్నాయని ఉస్మానియా ఉద్యమంలో అధికార పార్టీ అభ్యర్థి కన్నా ఎక్కువ శాతం ఉద్యమంలో పాల్గొన్నానని తాను అందరికీ సుపరిచితుడనని తనకు టికెట్ కేటాయించాలని డాక్టర్ పిడమర్తి రవి అధిష్టానాన్ని కోరుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని ఎన్నోసార్లు అధికార పార్టీని అవినీతి విషయంలో నిలదీశానని తనకు టికెట్ కేటాయించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనపర్తి జ్ఞాన సుందర్ కాంగ్రెస్ పెద్దల వద్ద వివరించినట్లు సమాచారం .కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తుంగతుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు దామోదర్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుందా? లేక దామోదర్ రెడ్డి మాటలు పక్కనపెట్టి అభ్యర్థిని ప్రకటిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట టికెట్ మీదనే తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ గెలుపోటములు ఉంటాయనేది తుంగతుర్తి నియోజకవర్గ ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నాయకుల మాటగా తెలుస్తోంది .ఒకవేళ దామోదర్ రెడ్డికి సూర్యాపేట టికెట్ కేటాయించనీ  పక్షంలో తుంగతుర్తి నియోజకవర్గం పై ప్రభావం భారీగా ఉంటుందని పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అటు సూర్యాపేటలో, తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా  మోగించాలంటే సూర్యాపేట టికెట్ దామోదర్ రెడ్డి కేటాయించి తుంగతుర్తి లో సైతం దామోదర్ రెడ్డికి అనుకూలమైనవ్యక్తికి ఇచ్చినట్లయితే విజయం సునయస మవుతుందనేది కాంగ్రెస్ నేతల మాట.

గత నాలుగు దశాబ్దాలుగా తుంగతుర్తి సూర్యాపేటలో గట్టి క్యాడర్ కలిగి ఉన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి టికెట్ పైనే సూర్యాపేట తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆధారపడి ఉందనేది నగ్నసత్యంగా తెలుస్తోంది .తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం సూర్యాపేట టికెట్ ఎవరికి ఇస్తారు అనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తుంగతుర్తి సూర్యాపేట అధికార పార్టీ నేతలు సైతం సూర్యాపేటలో దామోదర్ రెడ్డికి టికెట్ వస్తే తమ గెలుపులకు ప్రశ్నార్ధకమైనని దామోదర్ రెడ్డికి రానిపక్షంలో అధికార పార్టీ నేతలు భారీ మెజారిటీతో గెలుపొందే అవకాశాలు ఉంటాయని అధికార పార్టీలో చర్చ సాగుతోంది. మరి కాంగ్రెస్ అధిష్టానం దామోదర్ రెడ్డి టికెట్ను పక్కన పెడతారా? ఒకవేళ పక్కన పెడితే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తారా ?తాను తన వయసు దృష్ట్యా ఈసారి ఎన్నికలో చివరిసారిగా పోటీలో ఉంటానని అందుకే అధిష్టానం తనకు టికెట్ కేటాయించాల్సి ఉందని తాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్లని తనకు తప్పకుండా టికెట్ వస్తుందని దామోదర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తుంగతుర్తి గెలుపు సూర్యాపేట టికెట్ పైనే ఆధారపడి ఉంటుందని మాట  సర్వత్ర వినవస్తుంది .మరి అధిష్టానం సూర్యాపేట టికెట్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి ఇచ్చి తుంగతుర్తి స్థానాన్ని ఆయన సూచించిన వ్యక్తికి ఇస్తారా ?లేదా ?అనేది ఒకటి రెండు రోజుల్లోనే తేలనుంది. అప్పటిదాకా ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో అటు అధికార పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత తప్పకపోవచ్చు.