నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం

కడుపులో కాటన్ పెట్టి కుట్లు వేసిన వైద్యులు.. తీవ్ర రక్త శ్రావమై గిరిజ మహిళా మృతి

ముద్ర, అచ్చంపేట: అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చిన అచ్చంపేట మండలం దర్శన్ గడ్డ తండా కు చెందిన రోజా అనే మహిళ డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా 15న డాక్టర్ కృష్ణ సిజేరియన్ ఆపరేషన్ చేశారు. బాబు జన్మించారు. కుట్లు వేసే సమయంలో కడుపులో కాటన్ పెట్టి కుట్లు వేయడంతో ఈనెల 22న ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స చేస్తున్న రక్త స్రావం ఎంతకు ఆగ కపోవడంతో పాటు వేరే గ్రూప్ రక్తం అక్కించారని ఆమె పరిస్థితి విషమించడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహిళ మృతితో ఆగ్రహం చెందిన రోజా కుటుంబ సభ్యులు, బంధువులు అచ్చంపేట పట్టణంలో డాక్టర్ కృష్ణ నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రి పై దాడి చేసి అద్దాలను ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. మహిళా మృతికి కారణమైన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అంబెడ్కర్ కూడలిలో మహిళా శవంతో ఆందోళన చేపట్టారు. వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. 

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, గువ్వల అచ్చంపేట పట్టణంలోని దర్శన్ గడ్డ ( 3వ వార్డు) కి చెందిన రోజా మృతి చెందడంతో బుధవారం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేస్తున్న విషయం తెలుసుకొని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అక్కడికి చేరుకుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మన్ నర్శింహా గౌడ్,స్థానిక బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.