తృటిలో తప్పిన పెను ప్రమాదం...

తృటిలో తప్పిన పెను ప్రమాదం...
  • స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు.....

ఆలేరు (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కందిగడ్డ గ్రామపంచాయతీ శివారులోని జాతీయ రహదారి 163 పై సోమవారం నాడు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలోని డివైడర్ పై దూసుకెల్లడంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. డివైడర్ల మధ్యలో బస్సు నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు.