అన్ని వర్గాలు కులాలకు చెందిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

అన్ని వర్గాలు కులాలకు చెందిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్
  • అంబేద్కర్ రాజ్యాంగమే అట్టడుగు వర్గాలకు ప్రాణం పోసింది
  • ఎమ్మెల్యే డాక్టర్ గాధరి కిషోర్ కుమార్

తుంగతుర్తి ముద్ర:-డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్అన్ని కులాలు అన్ని వర్గాల వారికి సంబంధించిన మహనీయుడని కేవలం మాల మాదిగలకే పరిమితం కాదని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు.సోమవారం మండల పరిధిలో తూర్పు గూడెం గ్రామంలో సాధన యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తీరులోనే అన్ని వర్గాలకు అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు .బడుగు బలహీన వర్గాలు మహిళలు నేడు చట్టసభల్లో ఉన్నారంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష నే అన్నారు .నేటి యువత 18 సంవత్సరాలకే ఓటు హక్కు వినియోగించుకోవడం విధానాన్ని కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం తోటే సాధ్యమైందని అన్నారు .తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సైతం అంబేద్కర్ రాజ్యాంగంలో ఆరోజుల్లోనే పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వెసులుబాటు కలిగిందని అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పార్లమెంటులోని అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాలవేసి నివాళులర్పించారని అన్నారు. అంతేకాక లేబర్ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి సమయపాలన నిర్ణయించింది కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమని అన్నారు .

తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా 125 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందని అన్నారు .అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే తాను సైతం శాసనసభకు వెళ్లగలిగాలని అందుకు రాజ్యాంగం తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం ప్రజల దీవెనలు రెండుసార్లు తనని ఎమ్మెల్యే చేశాయని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఏనాడో నెలకొల్పారని ఎమ్మెల్యే అన్నారు. తూర్పు గూడెం గ్రామంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇంకా చేయాల్సి ఉందని అన్నారు గ్రామానికి అవసరం ఉన్న దేవాలయం, గ్రామపంచాయతీ భవనాలను రానున్న కాలంలో నిర్మించగలమని అన్నారు. అన్ని రకాల అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని అదే విధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేసే విధంగా ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. సమావేశానికి ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ   దీపిక యుగంధర్ రావు తదితరులు.అనంతరం  తూర్పు గూడెం పాఠశాలలో అదనపు తరగతి గదులకు శంకుస్థాపన ఎమ్మెల్యే చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు ,సర్పంచ్ గుజ్జ   పూలమ్మ ,టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు , ఎంపీపీ గుండగాని కవిత, మార్కెట్ వైస్ చైర్మన్ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి ,సాధన యూత్ క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంతులతో పాటు పలువురు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.