బిజెపి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన అస్సాం సీఎం

బిజెపి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన అస్సాం సీఎం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప బస్సు యాత్రను అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ మంగళ వారం బాసర లో ప్రారంభించారు. బాసర సరస్వతీ మాత ఆలయంలో పూజాకార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఈ యాత్రను ఆయన ప్రారంభించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఈ యాత్ర 315 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ తదితరులు పాల్గొన్నారు.