ధరలు పెంచి  పేదల రక్తం పిండుతున్న కేంద్ర ప్రభుత్వం

ధరలు పెంచి  పేదల రక్తం పిండుతున్న కేంద్ర ప్రభుత్వం
  • పెంచిన గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలి
  • ఎఫ్డిసి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి 
  • తూప్రాన్ లో జాతీయ రహదారిపై బిఆర్ఎస్ ధర్నా 

తూప్రాన్, ముద్ర: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నులు, ధరలు పెంచే ప్రభుత్వం, పేదలను కొట్టి పెద్దోళ్లకి సద్ది కడుతుందని తెలంగాణ అటవీ శాఖ అభివృధి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని కరీంగూడా చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.  జాతీయ రహదారి కావడంతో దాదాపు రెండు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి వస్తువుపై ధరలు పెంచుతూ పేదవాడి నడ్డి విరుస్తుందని ధ్వజామెత్తారు. తెలంగాణలో బీదవారికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా పథకాలను ప్రవేశపెడుతుంటే దేశంలో మోడీ మాత్రం ప్రజలను నరకయాతన పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించకపోతే ప్రజలు ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  ఎంపీపీ పురం నవనీతరవి, రాష్ట్ర తెలంగాణ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, ఉమ్మడి మండల పిఎసిఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ నందలా శ్రీనివాస్, మనోహరబాద్ మండల పార్టీ అధ్యక్షుడు పురం మహేష్, పట్టణ అధ్యక్షులు సతీష్ చారి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర సర్పంచులు పోరమ్ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్, రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్,  రైతుబంధు సమితి కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు నారాయణ గుప్తా, మామిడి వెంకటేష్,  బట్టి జగపతి, గుమ్మడి శ్రీనివాస్, సర్పంచ్ నాగభూషణం, వెంకటేశ్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.