బుగ్గారెడ్డిని పరామర్శించిన బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు 

బుగ్గారెడ్డిని పరామర్శించిన బీ ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు 

ముద్ర, ఎల్లారెడ్డిపేట :ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన బిజెపి పార్టీ సీనియర్  నాయకులు మద్దుల బుగ్గారెడ్డిని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.బుగ్గారెడ్డి  తన  ద్విచక్ర వాహనం పై  శనివారం  సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం  నుంచి  పదిర  బస్టాండ్ మీదుగా  గ్రామంలోకి    వెళుతుండగా స్కూటీపై      వెనుకాలే  అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వస్తున్న వ్యక్తి  డీకొట్టాడు  ఈ సంఘటనలో   బుగ్గారెడ్డి   తీవ్రంగా గాయపడడంతో  కుడికాలు   ప్యాక్షర్  అయింది దీంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని  ఓ ప్రైవేట్  ఆసుపత్రిలో చికిత్స పొంది  ప్రస్తుతం  ఇంటివద్ద  కోలుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రొడ్డరాంచంద్రం, సిద్ది రెడ్డి , చెట్కూరి కృష్ణ మూర్తి గౌడ్ తదితరులు పాల్గొని అయన్నీ పరామర్శించారు.