అమెరికాలో భ‌ద్రాచ‌లం ఆల‌య నిర్మాణం...

అమెరికాలో భ‌ద్రాచ‌లం ఆల‌య నిర్మాణం...

ముద్ర,తెలంగాణ బ్యూరో:-అమెరికాలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహా ఆలయ నిర్మాణం మొదలైంది. అట్లాంటా సమీపంలోని కమింగ్‌ వద్ద రామాలయ నిర్మిస్తున్నారు. ఈ మేరకు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు, దాతల సహకారంతో ఆలయ నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు. మొత్తం 33 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల వ్యయంతో పనులు చేపట్టినట్లు పద్మనాభాచార్యలు వివరించారు. ఆలయంలో ఏర్పాటుచేసే శిల్పాలను ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తయారుచేయిస్తున్నారు.