మెదక్​లో వైభవోపేతంగా నల్లపోచమ్మకు బోనాలు

మెదక్​లో వైభవోపేతంగా నల్లపోచమ్మకు బోనాలు

ఎమ్మెల్సీ శేరి హాజరు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ పట్టణంలో అంగరంగ వైభవంగా మున్నూరు కాపు బోనాల వేడుక ఉత్సవాలు జరిగాయి. ఆదివారం సాయంత్రం  యువకుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాల మధ్యలో బోనాల ఉత్సవం నిర్వహించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.  మెదక్ పట్టణ ప్రజల ఆరాధ్య దైవం మాత నల్లపోచమ్మకు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 17వ వార్షిక పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయబద్దంగా పసుపు, కుంకుమ, వేపకొమ్మలతో అలంకరించి, పైన గండదీపం వెలిగించిన  బోనాలను.. మహిళలు పట్టణంలోని వివిధ వీధుల నుంచి డప్పుచప్పుల్లతో పట్టణంలో నవాపేట, పెద్దబజార్​, పిట్లంబేస్​, ఫతేనగర్​, చమన్​, గాంధీనగర్​, ఇందిరాపురికాలనీ, బ్రాహ్మణవీధి, ఆజంపుర, వీరహనుమాన్​ కాలనీతో పాటు ఆయా కొత్త కాలనీల నుంచి మెదక్​ పట్టణంలోని ప్రధాన కూడలి అయిన రాందాస్ చౌరస్తాకు తరలివచ్చారు.

అక్కడి నుంచి డీజే సౌండ్, బ్యాండ్ మేలాలు, యువకుల నృత్యాలతో భారీ ఎత్తున  బోనాల ర్యాలీ మొదలైంది. మహాత్మాగాంధీ రోడ్డు, మెయిన్​ రోడ్డు, మున్సిపల్ ఆఫీస్, పాత బస్టాండ్  మీదుగా ఆటోనగర్​లోని నల్లపోచమ్మ ఆలయం వరకు బోనాల ర్యాలీ కొనసాగింది. అనంతరం నల్లపోచమ్మ ఆలయం వద్ద మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు.  ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్​, మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ నారాయణ, మెదక్​ మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ బట్టి జగపతి, రాష్ట్ర, జిల్లా నాయకులు బట్టి ఉదయ్ కుమార్​, బోనగిరి చంద్రశేఖర్​, హర్కార్​ మహిపాల్​, మంకు వీర్​కుమార్​, నల్లాల విజయ్​ కుమార్​, శివకుమార్​, నాయిని ప్రసాద్​, కానుగు భూపతిరాజు,  డాక్టర్ శివదయల్, కామాటి కృష్ణ, బండ నరేష్​, సంగాయిపేట నర్సింలు, రాజు, నిఖిల్​, ఆంజనేయులు, పరశురామ్​, చంద్రశేఖర్​, వంశీ, మల్లేశం, మెదక్​ సొసైటీ వైస్​ ఛైర్మన్​ సూర్యతేజ, టీఎన్జీవో మెదక్​ జిల్లా ప్రెసిడెంట్​ దొంత నరేందర్​, నాగభూషణం, కౌన్సిలర్లు లలిత, చందన, ఆవారి శేఖర్​, మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.