మెదక్ జిల్లాలో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం

మెదక్ జిల్లాలో టెన్త్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 10700 మంది విద్యార్థులకు గాను 10671 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 29 విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు మొత్తం ఆరుగురు ఉండగా ముగ్గురు పరీక్షలు హాజరయ్యారు. మరో ముగ్గురు గైర్హాజరైనట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా కొల్చారం పరీక్ష కేంద్రం సందర్శించారు. అడిషనల్ కలెక్టర్ రమేష్ నర్సాపూర్ పరీక్ష కేంద్రం,  డిఇఓ రాధాకిషన్ నర్సాపూర్, మెదక్ సందర్శించారు. ఆర్డివో మెదక్,  స్క్వాడ్ అధికారులు మెదక్, రామయంపేట్, నిజాంపేట్, మాసాయిపేట్, కౌడిపల్లి, తూప్రాన్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు