క్యాన్సర్ పై అవగాహన 

క్యాన్సర్ పై అవగాహన 

చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం  క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డా. రమాదేవి (ఎంబీబీఎస్, జనరల్ మెడిసిన్ ) హాజరై మాట్లాడుతూ... కామన్ గా ప్రజలకు నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నాయని అన్నారు. చాలా మంది ప్రజలు చివరి దశలో హాస్పటల్ కి వస్తున్నారని, క్యాన్సర్ నీ ప్రథమ దశలో గుర్తించినట్లయితే,వారి జీవిత కాలంను పొడిగించిన వారమవుతమని తెలిపారు.

మనిషి జీవితంలో తన అలవాట్లు అనగా మద్యపానం,ధూమపానం, తంబాకు,గుట్కా, జర్ధా, జంక్ ఫుడ్స్, శారీరక శ్రమ లేకపోవడం మొదలగు వాటి వలన క్యాన్సర్ వస్తుందన్నారు.కామన్ క్యాన్సర్ లక్షణాలు,వాటిని ఎలా గుర్తు పట్టాలి, ఏ ఏ పరీక్షలు చేయించాలి, హాస్పటల్ కి ఎప్పుడు సంప్రదించలో కూలంకుషంగా ఆమె వివరించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినయోగం చేసు కోవాలని మండల వైద్యాధికారి డా.ధర్మ నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో  హెచ్ డబ్ల్యుసి వైద్యుల డా. సందీప్ రెడ్డి, డా. కార్తిక్, డా. లక్ష్మి ప్రసన్న, డా.మాధురి, డా.నిర్మల, సూపర్వైజర్లు హజిబబా, చంద్రకళ,హేమలత, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.