గణేష్ శోభాయాత్ర లో DJ సౌండ్స్ నిషేదం, అనుమతి లేదు: పట్టణ CI, రాజశేఖర్.

గణేష్ శోభాయాత్ర లో DJ సౌండ్స్ నిషేదం, అనుమతి లేదు: పట్టణ CI, రాజశేఖర్.

జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్  ఆదేశాల ప్రకారం DJ నిర్వాహకులకు అవగాహన 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రం నందు 27వ తేదీన నిర్వహించనున్న గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కార్యక్రమాల నందు డీజే పెట్టడానికి, బాణాసంచా పేల్చడానికి అనుమతి లేదనీ పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపారు. జిల్లా ఎస్పీ  రాజేంద్రప్రసాద్   ఉత్తర్వుల ప్రకారముగా సోమవారం పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్నటువంటి DJ సౌండ్ సిస్టమ్ నిర్వహుకులను పోలీసు స్టేషన్ వద్దకు పిలిపించి, వారితో  సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వినాయక నవరాత్రులలో కానీ, శోభాయాత్ర లో కానీ, నిమజ్జనములో కానీ DJ సౌండ్ సిస్టమ్ పెట్టుటకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు .

పెద్ద పెద్ద శబ్దాల కాలుష్యం వల్ల ఇబ్బందులు వస్తాయని, DJ  లు వద్దు అనే ప్రజల  అభ్యర్థనలు మేరకు  DJ లను పూర్తిగా నిషేధించడం జరిగినదన్నారు .ఒకవేళ ఎవరైనా ఉత్తర్వులను నిబంధనలను ఉల్లంగించి, అతిక్రమించి DJ సౌండ్ సిస్టమ్ పెట్టినట్లైతే చట్టరిత్యా చర్యలు ఉంటాయనీ ,DJ లను సీజ్ చేస్తామని అందుకే డీజే నిర్వాహకులకు ముందుగా  కౌన్సిలింగ్ చేస్తున్నామని చెప్పారు జిల్లా కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకున్నామనీ అలాగే శోభ, నిమజ్జనం కార్యక్రమాలను కూడా అంతే ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.  ఇందుకు ప్రజలు, భక్తులు, ఉత్సవ కమిటీలు, యువత పోలీసు వారికి సహకరించాలని వివరించారు. ఈ సమావేశంలో ఎస్సైలు యాకూబ్ సైదులు, మహేందర్ DJ నిర్వహుకులు పాల్గొన్నారు.