5,089 పోస్టులతో డీఎస్సీ

5,089 పోస్టులతో డీఎస్సీ
  • నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ 
  • ఈనెల 20 నుంచి అక్టోబర్​21 వరకు దరఖాస్తులు
  • నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ నియమక పరీక్ష(డీఎస్సీ/టీఆర్టీ) నోటిఫికేషన్ విడుదలైంది. మొదటిసారిగా  కంప్యూటర్ ఆధారిత పరీక్షలు(సీబీటీ) నిర్వహించనున్నారు. నవంబర్ 20 నుంచి 30 తేదీ మధ్య పరీక్షలు జరగనున్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్​20 నుంచి అక్టోబర్ 21 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. 

మొత్తం ఖాళీలు 5089..

మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వాటిలో 1,739 స్కూల్ అసిస్టెంట్లు, 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీలు, 611 భాషా పండితులు, 164 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఇచ్చారు. అదే నిబంధన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఇచ్చారు. అభ్యర్థులు దరఖాస్తు రుసుంగా రూ.1000 చెల్లించాలి. జిల్లాలవారీగా ఖాళీలు, ఇతర వివరాలను సెప్టెంబర్​15న తమ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని విద్యాశాఖ పేర్కొంది. 

జిల్లాలవారీగా ఖాళీలు.. 

ఆదిలాబాద్ జిల్లాలో 275 ఖాళీలు ఉన్నాయి. భద్రాది కొత్తగూడెం జిల్లాలో 185, హనుమకొండ జిల్లాలో 54, హైదరాబాద్ జిల్లాలో 358, జగిత్యాలలో 148, జనగామలో 76, జయశంకర్ భూపాలపల్లిలో 74, జోగులాంబ గద్వాల్ లో 146, కామారెడ్డిలో 200, కరీంనగర్ లో 99, ఖమ్మం లో 195, కుమ్రం భీం అసిఫాబాద్ లో 289, మహబూబాబాద్ లో 125, మహబూబ్ నగర్ లో 96, మంచిర్యాలలో 113, మెదక్ లో 147, మేడ్చల్ మల్కాజిగిరిలో 78 , ములుగులో 65 ఖాళీలు, నాగర్ కర్నూల్ లో 114 , నల్గొండలో 219, నారాయణ్ పేట లో 154, నిర్మల్ లో 115, నిజామాబాద్ లో 309, పెద్దపల్లిలో 43, రాజన్న సిరిసిల్లలో 103, రంగారెడ్డిలో 196, సంగారెడ్డిలో 283, సిద్ధిపేటలో 141, సూర్యపేటలో 185, వికారాబాద్లో 191, వనపర్తిలో 76, వరంగల్ లో 138, యాదాద్రి భువనగిరి జిల్లాలో 99 ఖాళీలు ఉన్నాయి.