మూల మలుపు..ప్రమాదాలకు పిలుపు

మూల మలుపు..ప్రమాదాలకు పిలుపు
  • ప్రమాదకరంగా వ్యవసాయ బావి...

 భూదాన్ పోచంపల్లి,ముద్ర: భూదాన్ పోచంపల్లి  పురపాలక కేంద్రం నుండి జగత్ పల్లి వెళ్లే ప్రధాన దారికి ఆనుకొని ఉన్న వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉంది. నిత్యం ఈ రహదారి గుండా వాహనదారులు, వ్యవసాయ కూలీలు, వివిధ గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి  రాకపోకలు నిర్వహిస్తుంటారు.ఈ బావి ములమలుపై ఉండటంతో ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణం చేయాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ  భావి రోడ్డుకి అతి దగ్గరగా ఉండడంతో హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం వల్ల ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప గుర్తించరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులను కానీ, రక్షణ గోడను కానీ,ఫెన్సింగ్ ను కానీ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.