కల్లిబొల్లి మాటలకు మోసపోకండి

కల్లిబొల్లి మాటలకు మోసపోకండి

ముద్ర, కోరుట్ల: బీఆర్ఎస్ పార్టీ కోరుట్ల కార్యాలయంలో ఎన్నారై బీఆర్ఎస్ బహరైన్ అధ్యక్షుడు సతీష్ కుమార్ ఆద్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఎన్నారై సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలలో గల్ఫ్ సంక్షేమం పేరుతొ కొత్త వారు వస్తున్నారని, వారి కల్లబొల్లి మాటలకు నమ్మి మోసపోవద్దని అన్నారు.

తెలంగాణ ఏర్పడ్డాక గల్ఫ్ వలసలు తగ్గాయని అన్నారు. గల్ఫ్ కార్మిక కుటుంబాలకు రాబోయే రోజుల్లో ప్రత్యేక సంస్థను ఏర్పటు చేయనున్నట్లు, అలాగే చాల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. తెలంగాణ అభివృద్ది కెసిఆర్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు. కారు గుర్తుకు ఓటెయ్యాలని సంజయ్ ని గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలో గల్ఫ్ కార్మికులు నాయకులు పాల్గొన్నారు.