23న దసరా సెలవు

23న దసరా సెలవు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ముద్ర, తెలంగాణ బ్యూరో : విజయదశమి దసరా సెలవును అక్టోబర్​23వ తేదీ(సోమవారం)కి మారుస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఈనెల 24న విజయదశమి సెలవును ప్రభుత్వం ప్రకటించింది. అయితే దసరా పండుగ విషయంలో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ విద్వత్ సభ సూచన మేరకు ఈనెల 23న విజయదశమి దసరా పండుగను నిర్వహించుకోవాలని పేర్కొంది. దీంతో దసరా సెలవును 23వ తేదీకి ప్రభుత్వం మార్చింది. ఇదిలావుండగా పాఠశాల విద్యార్థులకు సెలవులతోపాటు మిగతా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. బతుకమ్మ ప్రారంభ రోజు అక్టోబర్ 14న సాధారణ సెలవు ఇవ్వగా, దుర్గాష్టమి అక్టోబర్ 22 న ఐచ్ఛిన సెలవు ఇచ్చింది. దసరా పండుగ సందర్భంగా పాఠశాలలకు దాదాపు 13 రోజులు సెలవులు ఇచ్చారు. జూనియర్ కాలేజీలకు 7 రోజులు పాటు సెలవులు ఇచ్చారు.