ల్యాండ్ పూలింగ్ పై భగ్గుమన్న రైతులు సర్వే అడ్డగింత సర్వే అడ్డగింత

ల్యాండ్ పూలింగ్ పై భగ్గుమన్న రైతులు సర్వే అడ్డగింత సర్వే అడ్డగింత
Farmers fire about land pooling

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని అల్లాపూర్, రావేల్లి శివారులో సుమారు 25 ఎకరాలు లే అవుట్ అభివృద్ధి కోసం రైతులనుండి భూమిని సేకరించాలని సోమవారం ఆర్డీఓ ఆధ్వర్యంలో రైతులతో స్థానిక వ్యవసాయ కమిటీ మార్కెట్ లో సమావేశం ఏర్పాటు చేసి భూసేకరణ చర్చించారు. ఇంతవరకు బాగానేఉన్నా మంగళవారం అధికారులు సర్వేకు బయలుదేరగా సర్వే నెంబర్ 318లో కాస్తులో ఉన్న ఇమంపూర్ గ్రామ రైతులు అడ్డుకున్నారు.

తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్వే నిర్వహించి తమ జీవనదారం అయిన భూమిని లాక్కుంటారా సర్వే ఆపకపోతే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని పలువురు రైతులు సర్వే స్థలానికి రావడంతో సర్వే అధికారులు అక్కడినుండి వెళ్ళిపోయారు. అనంతరం రైతులు ఆర్డీఓ కార్యాలయంకు చేరుకుని ఆర్డీఓ ముందు వారి నిరసన తెలిపారు.ఈ సందర్బంగా ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ రైతులతో చర్చించారు. రైతుల అనుమతి లేకుండా భూసేకరణ చేపట్టమని రైతులు ఒప్పుకుంటేనే భూ సేకరణ చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో అక్కడినుండి రైతులు వెళ్లిపోయారు.