ముందస్తు పంట సాగు పై రైతుల కు అవగాహన కల్పించాలి

ముందస్తు పంట సాగు పై రైతుల కు అవగాహన కల్పించాలి
  • సీజన్ అడ్వాన్స్ తో ప్రకృతి వైపరీత్యాల కు చెక్
  • ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
  • వర్షాలకు తడిసిన ధాన్యం దిగుమతి విషయం లో మిల్లర్ల అభ్యంతరాలు తగదు
  • రవాణా విషయం లో జాప్యం వద్దు 
  • మంత్రి జగదీష్ రెడ్డి వరుస సమీక్షలతో  వే వేగంగా సాగుతున్న కొనుగోళ్లు
  • సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రబీ  సీజన్ లో 296 కొనుగోలు కేంద్రాల నుండి రెండు లక్షల  మెట్రిక్ టన్నుల పై  బడి ధాన్యం ను సేకరించిన యంత్రాంగం
  • రబీ ధాన్యం కొనుగోళ్ల పై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం 
  • పాల్గొన్న కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ  రాజేంద్ర ప్రసాద్,అడిషనల్  కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జేసీ మోహన్ రావ్, సివిల్ సప్లై అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్స్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సీజన్ అడ్వాన్స్ తో రైతులు ప్రకృతి వైపరీత్యాల కు చెక్ పెట్టవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ మేరకు రైతన్నలకు ముందస్తు పంట సాగు పై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలి అని మంత్రి ఆదేశించారు.. రబీ సీజన్ లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం  కొనుగోళ్ల కు సంబందించి సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో జిల్లా యంత్రాంగం తో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వెంకట్రావ్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశం లో ఎస్పీ  రాజేంద్ర ప్రసాద్,అడిషనల్  కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జేసీ మోహన్ రావ్, సివిల్ సప్లై అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్స్ పాల్గొన్నారు. రభీ సీజన్ కు సంబందించి మొత్తం జిల్లా లో 296 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా,20 కేంద్రాల లో ఇప్పటికే కొనుగోళ్లు పూర్తి కావడం తో మూసీ వేశామని అధికారులు వెల్లడించారు. మిగతా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వవేగవంతం గా సాగుతుందని అన్నారు.

ఇప్పటి వరకు జిల్లా  వ్యాప్తంగా 2,00,105.640 మెట్రిక్  టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 1,84,690.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంబంధిత మిల్లులకు తరలించామని, 15,414.720 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలింపుకు  సిద్దంగా ఉందని తెలిపారు. మొత్తం రైతుల నుండి సేకరించే ధాన్యాన్ని 412 .21 కోట్లు అవుతుండగా 185.44 కోట్ల ను ఇప్పటికే  14 వేల 297 మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఇంకా 14 వేల  817 మంది రైతుల ఖాతాల్లో  226.77 కోట్లు  జమ చేయాల్సి వుందని అన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ వర్షాలకు తడిసిన ధాన్యం దిగుమతి విషయం లో రైతులను  మిల్లర్లు ఇబ్బంది పెట్టవద్దని ఆదేశించారు..మిల్లర్ల అభ్యంతరాలు తగదు అన్న మంత్రి ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే  రవాణా విషయం లో జాప్యం లేకుండా  ట్రాన్స్ పోర్టర్స్ ను సంబధిత మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని కోరారు. మిగిలిన 14 వేల  మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం త్వరగా కొనుగోలు చేసే విధంగా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.