దివంగత ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్దిక సహాయం

దివంగత ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్దిక సహాయం

మోత్కూర్(ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షులు సీనియర్ ఫోటోగ్రాఫర్ రవ్వ వేణు దశ దినకర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుని కుటుంబానికి మోత్కూర్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున 11,100రూపాయలం ఆర్దిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు మండల ఫోటో గ్రాఫర్ల అధ్యక్షుడు చీమల వీరస్వామి, జిల్లా అసోసియేషన్ సభ్యులు చెపురి అనిల్,గుండు శ్రీను, గొడిశాల రమేష్ , జిల్లా అధ్యక్షులు భీమిడి మాధవ రెడ్డి,ప్రధాన కార్యదర్శి దిడ్డికాడి రాము, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.