ఆరోపణలు చేస్తే సహించేది లేదు. మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ.

ఆరోపణలు చేస్తే సహించేది లేదు. మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ.

మెట్‌పల్లి ముద్ర:- ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ల పై ప్రతిపక్ష నాయకులు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని. అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని తగిన బుద్ధి చెబుతామని మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం చైర్ పర్సన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు జీతాలు చెల్లించాలని నిరసన కార్యక్రమం తెలుపుతుంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు నాయకులు మరి కొంతమందితో కలిసి కార్మికులకు మద్దతు తెలుపుతున్నామని చెబుతూ వారిని రెచ్చగొట్టే విధంగా. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ లో చేరిన నాయకులు ప్రతిపక్షంలో లేరని అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని అవసరమైతే మున్సిపల్ కార్మికులకు ప్రత్యేక నిధులు విడుదల చేయించి జీతాలు చెల్లించవచ్చు అన్నారు. 

మున్సిపల్ ఉద్యోగులకు అదనంగా ఎన్నికల విధులు, ఇప్పుడు ప్రజా పాలన కార్యక్రమ విధులు ఉండడంవల్ల పన్నుల వసూల్లలో ఆలస్యం అవుతుందని దీనివలన కార్మికులకు జీతాలు ఇవ్వలేదని. అనవసరంగా కమిషనర్ ను మీ స్వార్ధ ప్రయోజనాల కోసం అభాసు పాలు చేయొద్దన్నారు. అందరి వద్ద పన్నులు వసూలు చేస్తున్నారని. ఖాదీ బోర్డుకు వెజ్ ఆండ్ నాన్ వెజ్ మార్కెట్ లీజ్ బిల్లులు మున్సిపల్ చెల్లించాల్సి ఉందన్నారు.ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వాహనాల్లో మున్సిపల్ కార్యాలయం నుండి డీజిల్ పోస్తున్నారనేది అబద్ధం అన్నారు.

 ఇన్ని రోజులు బీ ఆర్ ఎస్ పార్టీలో అధికారంతో పదవులు, రాజాబోగం అనుభవించి పార్టీ మారిన ఒక్క రోజులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్ లు బుచ్చిరెడ్డి, అంగడి పురుషోత్తం, బంగారుకాళ్ళ కిషోర్, లంక గంగాధర్, మోరపు గంగాధర్, మన్నే ఖాన్,  నాయకులు ఎనుగందుల శ్రీనివాస్ గౌడ్, ద్యావనపెళ్ళి రాజారాం, శ్రీనివాస్,  భీమనాతి సత్యనారాయణ,  మార్గం హనుమాన్లు, జియా ఉల్ హక్ తదితర నాయకులు పాల్గొన్నారు.