వర్గీకరణ చేయకుంటే..మరో పోరాటానికి సిద్ధం కావాలి ఎమ్మెల్యే రాజయ్య

వర్గీకరణ చేయకుంటే..మరో పోరాటానికి సిద్ధం కావాలి ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుంటే మాదిగలు మరో పోరాటానికి సిద్ధం కావాలని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య పిలుపునిచ్చారు. ఈ నెల 19 నుండి 22వ తేదీ వరకు జరగనున్న అత్యవసర పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టించాలని కోరుతూ ఎంఎస్ పి, ఎంఆర్ఎఫ్ నాయకులు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు మంగళవారం వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో వర్గీకరణ బిల్లు తెస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎస్సీలలో అధిక శాతం ఉన్న మాదిగల ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం పార్టీలను పక్కకు పెట్టి మాదిగలు ఏకం కావాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న మాదిగల ఆత్మగౌరవం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని, ఏబీసీడీ సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మడిపల్లి శ్యామ్, కోయడ మల్లేష్, బి.మహేష్, జి.అశోక్, పి.రాజశేఖర్, ఎన్.నాగరాజు, వెంకటస్వామి, మధు, గాదె శ్రీధర్, శ్రీనివాస్, రఫీ, ఎల్ల స్వామి, యాదగిరి, వెంకటేష్, జీవన్, రాంచందర్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.