శంషాబాద్ విమానాశ్రయం లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

శంషాబాద్ విమానాశ్రయం లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ సీఈఓ ప్రదీప్ పణికర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, భద్రతా దళాల సేఫ్టీ డ్రిల్స్, CISF మహిళా కమెండోల యోగా ప్రదర్శన మరియు క్విక్ రెస్పాన్స్ టీమ్ యొక్క మార్షియల్ ఆర్ట్స్ ప్రదర్శన లు అందరిని అలరించాయి. పరేడ్లు మరియు వివిధ కార్యక్రమాలు వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చి అందరినీ ఆకర్షించాయీ.