వెల్గటూర్ లో ఘనంగా మోహర్రం వేడుకలు...

వెల్గటూర్ లో ఘనంగా మోహర్రం వేడుకలు...

వెల్గటూర్, ముద్ర : జగిత్యాల జిల్లా, వెల్గటూర్ మండలంలోని స్థంభంపల్లి, జగదేవ్ పేట గ్రామాలతో  పాటుగా పలు గ్రామాలలో మిస్లింలు మొహర్రం  వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకుకున్నారు. కాగా తొమ్మిది రోజులుపాటు గ్రామంలో నిలిపి  ఉంచిన పీరీలతో పాటుగా సవారీలకు హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా కొబ్బరికాయలు కొట్టి భక్తి శ్రద్ధలతో మెక్కులు చెల్లించుకున్నారు. రాత్రి సమయంలో పీరిల ముందు ఏర్పాటు చేసిన గుండంలో కట్టెలు వేసి యువకులు పాటలు పాడుతూ  ఉత్సాహం గా ఆడారు. చివరిరోజు పీరీలను ఊరేగిస్తూ అమరులైన వారి త్యాగాలను  గుర్తు చేసుకుంటూ ముస్లింలు బాధాతప్త హృదయాలతో గ్రామాలలో తిరిగారు. ఈ సందర్బంగా చాలామంది తమ కోర్కెలను నెరవేరేల చూడాలని పేర్కొంటు పీరీలకు దస్థి కట్టారు. అనంతరం గ్రామ శివారులో  గల చెరువులు, కుంటాలల్లో నిమజ్జనం చేశారు.