పేటీఎంకు ఎదురుదెబ్బ... ఫాస్టాగ్‌ జారీ నిలిపేసిన IHMCL !

పేటీఎంకు ఎదురుదెబ్బ... ఫాస్టాగ్‌ జారీ నిలిపేసిన IHMCL !

ముద్ర, తెలంగాణ బ్యూరో:- ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL),ప్రభుత్వ యాజమాన్యంలోని NHAI టోల్ కలెక్టింగ్ విభాగం,ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌ ను తొలగించింది.ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించటం కోసం తాము పేర్కొన్న బ్యాంకుల నుండి FASTags కొనుగోలు చేయాలని యూజర్లకు సూచించింది.32 అధీకృత బ్యాంకుల్లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్,ఐసిఐసిఐ బ్యాంక్,ఐడిబిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,యెస్ బ్యాంక్ ఉన్నాయి.