బీఆర్‌ఎస్‌తోనే ప్రజా సంక్షేమం

బీఆర్‌ఎస్‌తోనే ప్రజా సంక్షేమం
  • కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష 
  • బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం
  • పార్టీలకు అతీతంగా యువత బీఆర్ఎస్ లోకి రావడం అభినందనీయం
  • ప్రగతికి మలుపుగా జగదీష్ రెడ్డి గెలుపు
  • అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ గూటికి చేరిన ఆత్మకూరు మండలం తుమ్మల పెన్పహాడ్ బిజెపి నాయకులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట నియోజకవర్గంలో పార్టీలకతీతంగా సబ్బండ వర్గాలు భీఆర్ఎస్ కు జై కొడుతున్నారు. 2018లో గులాబీ జెండా ను ఎగరేసిన మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రగతిని మలుపు తిప్పారు. నలుమూలల అభివృద్ధిని పరుగులు పెట్టించడంతోపాటు, సాగునీటిని పుష్కలం చేసి సూర్యాపేటను అన్నపూర్ణగా మార్చారు. పదేళ్లలో మంత్రి చేసిన అభివృద్ధికి నియోజకవర్గ ప్రజల్లో పార్టీలకతీతంగా ఆదరణ పెరుగుతుండటమే దీనికి కారణం. టిఆర్ఎస్ లోకి వెలువలా కొనసాగుతున్న చేరికలే దీనికి నిదర్శనం. మంత్రి అభివృద్ధి మంత్రానికి సూర్యాపేటలో కాంగ్రెస్ ఖతం అవుతుండగా, బిజెపి ఇప్పటికే మాయమైపోయింది. తాజాగా సూర్యాపేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వందమంది బిజెపి నేతలు, కార్యకర్తలు మంత్రి జగదీశ్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి  మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌తోనే ప్రజాసంక్షేమం సాధ్యమని అన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయని పదేండ్లలో సూర్యాపేట నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువకులందరూ బీఆర్‌ఎస్‌ పార్టీ వైపు చూస్తుండటం అభినందనీయం అని తెలిపారు.సీఎం కేసీఆర్‌ ప్రజా సంక్షేమ పరిపాలన అందిస్తున్నారన్నారు. ఇందుకు నిదర్శనం 60ఏండ్ల అభి వృద్ధిని కేవలం పదేండ్ల లో చేసి చూపెట్టడమేనన్నారు. తెలంగాణలో మూడో సారి కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని దీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. అంతకుముందు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం తుమ్మల పెన్పహాడ్ కు చెందిన 105 మంది బిజెపి నేతలు కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. చేరిన వారిలో ఎరగని ఉపేందర్ గౌడ్, లింగయ్య గౌడ్, ఎల్లయ్య, లెనిన్, సందీప్ , వరికుప్పల వెంకటేష్ ,శ్రీకాంత్, వేణు లింగరాజు ,తిరుపయ్య లతో పాటు 105 మంది బిజెపి కార్యకర్తలు బీఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు.