అవినీతిలో రారాజు కేసీఆర్

అవినీతిలో రారాజు కేసీఆర్
  • నిర్మల్ లో డి -1 పట్టాలపై విచారణ జరపాలి: బిజెపి నిర్మల్ జిల్లా సమావేశం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఒకపక్క మోదీ ప్రపంచ దేశాల్లో ఉత్తమ పాలకుడుగా గుర్తింపు పొందితే, మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికి రారాజుగా పేరుపొందారని బిజెపి రాష్ట్ర నాయకుడు పార్లమెంట్ ఇంచార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం స్థానిక బాలాజీ హాల్లో జరిగిన బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా నేతల ఉద్దేశించి అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్ళిస్తూ, నిధులు ఇవ్వలేదని ఆరోపణలు చేసే కేసీఆర్ ను ప్రజలు ఎవరు నమ్మటం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రజలందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

మోడీ హయాంలోని ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల్లో ఉగ్రవాద రహిత భారతదేశాన్ని రూపొందించిందన్నారు. కాగా కేసీఆర్ ధనవంతమైన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు. తొమ్మిదేళ్ల మోది ప్రభుత్వ విజయాలను ఘనంగా జరుపుకునేందుకు నెలరోజుల పాటు మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డి  -1పట్టాల పేరిట భూ అక్రమములకు పాల్పడ్డారని దీనిపై ఉద్యమించాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ  జిల్లా అధ్యక్షులు రమాదేవి,జిల్లా సహ ఇంచార్జి మ్యాన మహేష్,మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ ఇంఛార్జి అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మె రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి,రామారావు పటేల్, మోహన్ రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.