కేసీఆర్​కు వైరల్​ ఫీవర్​

కేసీఆర్​కు వైరల్​ ఫీవర్​

త్వరలో కోలుకుంటారన్న కేటీఆర్​

ముద్ర, తెలంగాణ బ్యూరో  ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజులుగా వైరల్​ ఫీవర్​, దగ్గుతో బాధ పడుతున్నారని మంత్రి కేటీఆర్​తెలిపారు. ప్రగతి భవన్​లోనే ఆయనకు వైద్య బృందం తగిన చికిత్స అందిస్తోందని వెల్లడించారు. త్వరలోనే సీఎం కేసీఆర్​కోలుకుని మన మధ్యకు వస్తారని పేర్కొన్నారు. ఈమేరకు కేటీఆర్​మంగళవారం రాత్రి ఒక ట్వీట్​చేశారు.

అంతకు ముందు కేటీఆర్​హుటాహుటిన తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ప్రగతి భవన్​కు బయల్దేరి వెళ్లారు. దీంతో కేసీఆర్​ఆరోగ్యం బాగా లేదని ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తెరవేస్తూ కేటీఆర్​పై ట్వీట్​చేశారు.