కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం 

కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం 

అక్షయ తృతీయ సందర్భంగా వినయ్ ఛారిటీ ప్రోగ్రామ్

ముద్ర విలేఖరి: రాజేంద్రనగర్: అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారంనాడు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నవభారత్, రెనోవా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో హైదర్ షాకోట్ లోని కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్టు ఆశ్రమంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.

ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యులు పాల్గొని వృద్ధులు, అనాథలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. శుక్రవారం రాత్రి లయన్స్ క్లబ్ హైదరాబాద్ నవభారత్ అధ్యక్షుడు బి వి ఎస్ రావు (బి వినయ్) కుటుంబం ఆధ్వర్యంలో అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.