ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడిగా ఖానాపురం లక్ష్మణ్ మాదిగ ఎన్నిక

ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడిగా ఖానాపురం లక్ష్మణ్ మాదిగ ఎన్నిక

ముద్ర, ఎల్లారెడ్డిపేట: ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ అనుబంధ విభాగాల సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిలుగా ఎంఎస్పి జిల్లా ఇంఛార్జి ఇంజం వెంకటస్వామి మాదిగ, రాష్ట్ర నాయకులు అవునూరు ప్రభాకర్ మాదిగలు హాజరై నూతన కమిటీ ఎన్నుకొన్న అనంతరం వారు మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించుకోవడంతోపాటు సామాజిక న్యాయమే జెండాగా జాతిలో రాజకీయ చైతన్యాన్ని నింపి పోరాటాన్ని ఉధృతం చేయాలని అన్నారు. పోరాట వీరులుగా గుర్తింపు పొందిన మాదిగ బిడ్డలు రాజకీయ చైతన్యాన్ని నింపుకొని మహనీయులు కలలుగన్న మహజన రాజ్య స్థాపన కోసం సామాజిక పరివర్తకులు మహాజననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమించాలని కోరారు.

అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. MSP జిల్లా కమిటీ,జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లారం చంద్రమౌళి మాదిగ,జిల్లా ఉపాధ్యక్షులు గుండ్రేటి రాజు మాదిగ,వడ్లూరి రాజం మాదిగ, ఆవునూరి లచ్చన్న మాదిగ,జిల్లా కార్యదర్శులు పుత్తూరు రాజం మాదిగ,తాండ్రాల తిరుపతి మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అడక్ కమిటీ.జిల్లా కన్వీనర్ - ఎలగందుల బిక్షపతి మాదిగ
జిల్లా కో- కన్వీనర్
నేరెళ్ల శ్రీనివాస్ మాదిగ 
పసుల కమలాకర్ మాదిగ
పసుల బెన్ కుమార్ మాదిగ

తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ కి, జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ ఉపకులాల ప్రజలతోపాటు సమాజంలోని సబ్బండ వర్గాలనేకం చేస్తూ సామాజిక న్యాయమే లక్ష్యంగా నూతనమైన రాజకీయ పోరాటానికి సిద్ధం చేస్తామని ఆ దిశగా అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు.